ఒక్కప్పుడు సిల్వర్ స్రీన్ పై స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన నటి ఇంద్రజ ఇప్పుడు మాత్రం బుల్లితెరపై తన సత్తాను చాటుతోంది. వయసు పెరిగినా చెక్కుచెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కామెడీ షోలకు జడ్జీగా చేస్తూ సినిమాల్లో సైతం నటిస్తోంది. అయితే చాలా కాలం తర్వాత మరోసారి తన సత్తాను చాటుకోవాలనుకంటున్న ఈ అందాల హీరోయిన్ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో జడ్జీగా చేస్తుంది.
ఇలా బుల్లితెరపై అందివచ్చిన అవకాశాలను అందుకుంటూనే సినిమాల్లో సైతం నటిస్తుంది ఇంద్రజ. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనపై పెళ్లి విషయంపై కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. నేను హిందువు అమ్మాయి అయినప్పటికీ మస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అయితే మొదట్లో మీద్దరం ఇష్టపడిన వెంటనే పెళ్లి చేసుకోలేదని తన భర్తపై నమ్మకొచ్చిన తర్వాత ఆరేళ్లకు పెళ్లికి సిద్దపడ్డానని నటి ఇంద్రజ చెప్పుకొచ్చింది. ఇక మనుషులను ఇష్టపడడం అనేది వారి కులాన్ని, మతాన్ని చూసి నచ్చుకోవడం కరెక్ట్ కాదని ఇంద్రజ అభిప్రాయపడింది.