గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. గాయత్రి డాలీ గా పేరు తెచ్చుకున్న అప్ కమింగ్ హీరోయిన్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.
నగరంలోని గచ్చిబౌలిలో కారు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న రోహిత్, గాయత్రి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.
మృతి చెందిన గాయత్రి డాలీ ని డి క్రూజ్ అని కూడా పిలుస్తారు. గాయత్రి డాలీ కి ఇన్ స్ట్రాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 2021 లో ‘LoL సలాం’మినీ వెబ్ సీరీస్ లో నటించింది. తెలుగు ఇండస్ట్రీలో నటించే ప్రయత్నాలు కూడా జరుతున్న సమయంలో ఇలాంటి విషాదం చోటు చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి భవిష్యత్ ఊహించుకున్న గాయత్రి డాలీ ఆకస్మిక మరణంపై సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.