శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి(డాలీ డీ క్రూజ్).. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల హోలీ సందర్భంగా స్నేహితుడు రోహిత్ తో కలిసి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ హోలీ ఈవెంట్ లో పాల్గొంది.
ఈ క్రమంలో అతివేగంగా కారు నడుపుతూ గచ్చిబౌలి ఎల్లా హోటల్ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే గార్డెన్‌లో పనిచేసే మహేశ్వరి అనే మహిళ చనిపోయింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గాయత్రి మృతి చెందింది. అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన రోహిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పాతికేళ్ల వయసులోనే ప్రముఖ యూ ట్యూబర్ గాయత్రి అలియాస్ డాలీ డీ క్రూజ్ దుర్మరణం పాలైంది. ఇదిలా ఉండగా.. ప్రమాదంలో మరణించిన మహేశ్వరి అనే మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, ఆమె బంధువులు నిరసన తెలుపుతున్నట్లు సమాచారం.