శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా మృతి చెందింది. ఫుట్‌పాత్‌పై ఉన్న పూల మొక్కలకు మహేశ్వరమ్మ అనే మహిళ నీళ్లు పోస్తుండగా.. ఆదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. మహేశ్వరమ్మను ఢీకొని ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారు నడిపినవారు మద్యం సేవించి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన మహేశ్వరమ్మ బంధువులు ధర్నాకు దిగారు. ఎల్లా హోటల్‌లో తోటమాలిగా పనిచేస్తున్న మహేశ్వరమ్మ.. డ్యూటీలో ఉండగానే ప్రమాదవశాత్తు చనిపోయింది. ఐతే.. దీనిపై ఎల్లా హోటల్ యాజమాన్యం తమతో దురుసుగా ప్రవర్తించిందని.. తమకు ఎలాంటి ఆర్థిక సాయం కూడా అందించలేదంటూ మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు.
మహేశ్వరమ్మ కూతురు అనిత మాట్లాడుతూ.. ” తన తండ్రి రాములు కూడా ఇదే హోటల్‌లో పనిచేస్తూ మరణించాడు. అప్పుడు కూడా ఎల్లా హోటల్ యాజమాన్యం మాకు ఎలాంటి సాయం చేయలేదు. ఇప్పుడు మా అమ్మ కూడా ఇక్కడ పని చేస్తూ.. కారు ప్రమాదంలో చనిపోయింది. కనీసం ఇప్పుడు కూడా యాజమాన్యం మాపై కనికరం చూపెట్టడం లేదు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి నేను, మా తమ్ముడు ఇద్దరం ఆనాథలుగా మిగిలాము” అంటూ కన్నీటి పర్యతమయ్యింది. సాయం కోసం వెళితే.. ఎల్లా హెటల్ యాజమాన్యం తమతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. చూసుకుంటాం అని బెదిరిస్తున్నారని తెలిపింది. ప్రభుత్వమే స్పందించి తమకు న్యాయం చేయాలని మహేశ్వరమ్మ పిల్లలు వేడుకుంటున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.