movie news: ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ మార్చి 31న గుండె నొప్పితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తర్వాత ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. అక్కడ మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. అయితే, ఇన్‌ఫెక్షన్ సోకటంతో బుధవారం మరోసారి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు.
ఈ విషయం తెలిసిన సినిమా ప్రముఖులతో పాటు అభిమానులు కూడా శ్రీనివాసన్ త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నారు. కాగా, శ్రీనివాసన్ పీఏ బ్యాకర్ దర్శకత్వం వహించిన 1976లో వచ్చిన ‘మనిములక్కమ్’తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1979లో వచ్చిన ‘సంఘగనమ్’తో హీరో అయ్యారు. ‘‘ ఒడరుతమ్మవ’ సినిమాతో రచయితగా మారారు. ఇప్పటి వరకు 250కి పైగా సినిమాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి : వీడియో: చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది! ఉపేంద్ర ఎమోషనల్ స్పీచ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.