భారత క్రికెటర్లలో ఉ్తతరాది వాళ్లే ఎక్కువ. సౌత్ కి చెందిన వాళ్లకు వచ్చే ఛాన్సులు చాలా తక్కువని అంటుంటారు. ఇదంతా పక్కనబెడితే టీమిండియా తరఫున ఆడిన పలువురు దక్షిణాది క్రికెటర్లు చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. జట్టులో తన మార్క్ క్రియేట్ చేసి వెళ్లిపోయారు. అలాంటి వారిలో వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర నుంచి పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అద్భుతమైన బౌలర్లు, ఆల్ రౌండర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే వాళ్ల గురించి అప్పుడప్పుడు మాట్లాడే సమయం వస్తూ ఉంటుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమా అంటే చాలు నటుడు బ్రహ్మాజీ కనిపిస్తుంటాడు. కామెడీ, సీరియస్ రోల్ అనే తేడా ఏం ఉండదు. తనకు ఇచ్చిన ప్రతి ఛాన్సుని యూజ్ చేసుకుంటూ రెచ్చిపోతుంటాడు. తాజాగా పనిమీద ముంబయి వెళ్లిన అతడు.. అక్కడ టీమిండియా మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వెంకటేశ్ ప్రసాద్ లని కలిశాడు. వాళ్లతో తీసుకున్న ఓ ఫొటోని ట్విట్టర్ లో పోస్టు చేశాడు. సింపుల్, స్వీట్, సౌత్ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. 1994 నుంచి 2001 వరకు దాదాపు ఏడేళ్లపాటు టీమిండియాకు వెంకటేశ్ ప్రసాద్ ఆడాడు. 33 టెస్టుల్లో 96, 161 వన్డేల్లో 196 వికెట్లు తీశాడు. రిటైర్మెంట్ తర్వాత కామెంటరీ చేస్తూ వచ్చిన ఇతడు.. ఐపీఎల్ లోనూ బెంగళూరు, పంజాబ్ జట్లకు బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు. ఇక 1990 నుంచి 2001 వరకు భారత జట్టుకు ఆడిన వెంకటపతిరాజు.. 28 టెస్టుల్లో 93 వికెట్లు, 53 వన్డేల్లో 63 వికెట్లు తీశారు. ఇప్పుడు ఈ క్రికెటర్లని బ్రహ్మాజీ కలవడం హాట్ టాపిక్ గా మారింది.
#Mumbai met our legendary cricketers Raju n prasad.. simple ..sweet.. south..❤️🤗@venkateshprasad #venkatapathiraju pic.twitter.com/w9FHP3KDBr
— Brahmaji (@actorbrahmaji) November 21, 2022