మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘ఆచార్య‘. ధర్మస్థలి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆచార్య ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ అని ఎక్సపెక్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ ఊరమస్ ట్రీట్ అందించాడు దర్శకుడు కొరటాల. మెగాస్టార్ మాసివ్ లుక్ లో, చరణ్ క్లాస్ లుక్ లో అదరగొట్టేశారు. అద్భుతమైన డైలాగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ లో వినిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకునేలా ఆచార్యను తీర్చిదిద్దారు నిర్మాతలు.
దాదాపు మూడేళ్ల తర్వాత మెగాస్టార్ వెండితెరపై కనిపించనున్నారు. ఇప్పటికే సాంగ్స్. టీజర్లతో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ ని తెరపై చూపించే దర్శకుడు కొరటాల శివ.. ఈసారి మెగా హీరోలతో భారీ మెసేజ్ ఇవ్వనున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
ట్రైలర్ లో ఎలివేషన్స్ మాత్రం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం గురించి చెప్పక్కర్లేదు. పూజా హెగ్డే చాలా క్యూట్ గా ఉంది. కానీ ట్రైలర్ లో ఎక్కడ కూడా కాజల్ అగర్వాల్ కనిపించలేదు. మరి సినిమాలో ఆమె రోల్ ఎలా ఉంటుందో క్లూ కూడా వదల్లేదు. మరి మాసివ్ ఆచార్య ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.