2018 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. 2018లో కేరళలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇదే నేపథ్యాన్ని తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుమారు 150 కోట్లపై రాబట్టి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్..
2018 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. 2018లో కేరళలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇదే నేపథ్యాన్ని తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుమారు రూ. 200 కోట్లపై రాబట్టి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో కూడా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీవాస్ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగా వసూళ్లు అయ్యాయి. అంతలోనే ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ కొనుగోలు చేసింది. థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో కొనసాగుతుండగానే.. ఈ నెల 6 నుండి ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళం, తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు.
ఈ చిత్రంలో అనూప్ అనే క్యారెక్టర్‌లో కనిపించారు మలయాళ నటుడు టోవినో థామస్. అతడి ప్రేయసిగా నటించింది తన్వీరామ్. కుంచికో బొబన్, అపర్ణా బాల మురళి, లాల్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ ఇతర పాత్ర ధారులు. అయితే ఇందులో రెండు లవ్ స్టోరీలు ఉన్నా.. టోవినో థామస్, తన్వీరామ్ ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. చివరకు వీరి ప్రేమ కథ విషాదంతం అయినప్పటికీ.. కచ్చితంగా హీరోయిన్‌పై కూడా జాలి కలుగుతుంది. ఈ సినిమాలో చాలా చక్కగా నటించింది తన్వీ రామ్. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆమె అస్సలు పేరు శృతి రామ్. ఈ కేరళ కుట్టి 2012 మిస్ కేరళ ఫైనలిస్ట్ లో ఒకరు. 2019లో అంబిలీ అనే సినిమా ద్వారా మాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే 10 చిత్రాల్లో నటించింది.
అయితే ఈ మలయాళ కుట్టికి.. టాలీవుడ్‌తో కూడా సంబంధం ఉంది. అదేంటంటే.. ఈ మలయాళ కుట్టీ తెలుగులో ఓ సినిమా చేసింది. అదే మన నాని ‘అంటే సుందరానికి’సినిమాలో నటించింది. ఏ క్యారెక్టర్ అనుకుంటున్నారా.. నాని వదిన పాత్ర. అదేనండీ హీరోయిన్ నజ్రియా అక్క పాత్రలో ఆమె మెరిసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది తన్వీ రామ్. నజ్రియా అక్క పాత్ర పుష్ప క్యారెక్టర్ లో నటించింది. ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంటుంది. కానీ బిడ్డ చనిపోవడంతో..బాధపడుతుంది. దీంతో తండ్రి చిన్న కూతురైన లీలా(నజ్రియా) ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసేందుకు వెనకాడతాడు. అలా ఆ సినిమాకు ఆమెనే కీ రోల్ అయ్యింది. ప్రస్తుతం 2018 హిట్ ను ఎంజాయి్ చేస్తుంది ఈ అమ్మడు.