రామాయణం ఇతిహాసాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో రూపుదిద్దుకున్న సినిమా ‘ఆదిపురుష్’. మరో నాలుగు రోజుల్లో ‘ఆదిపురుష్’ సినిమా మన ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రేయస్ మీడియా 101 రామాలయాలకు ఆదిపురుష్ సినిమా టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
హిందువులకు రామాయణం అన్నా, శ్రీరాముడన్నా భక్తి ఎక్కువ. ప్రతి హిందువులో నరనరాన రామభక్తి తొణికిసలాడుతుంది. రామాయణంలోని ప్రతి ఘట్టం మన జీవితాలకు దగ్గరి సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తుంది. వందల యేళ్లయినా కూడా మనకు రాముని జీవితం ఆదర్శమే. రామాయణ ఇతిహాసాన్ని తెరపై చూపించే ప్రయత్నంలో రూపుదిద్దుకున్న ఆదిపురుష్ మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రేయస్ మీడియా ఆదిపురుష్ సినిమా విడుదలపై ఓ ప్రకటన చేశారు. అది ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి రామాలయానికి 101 టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. రామాయణంలో ఉడత కూడా తన రామభక్తిని చాటుకున్నట్లు ఒక్కొక్కరు వారి స్థాయికి తగ్గట్లుగా రామభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఎప్పుడెప్పుడు తెరమీదికి వస్తుందని దేశం మొత్తం ఎదురుచూస్తుంది. మరో నాలుగు రోజుల్లో ఆదిపురుష్ సినిమా మన ముందుకు రానుంది. ఈ చిత్రంలోని రెండు పాటలతోనే ఎక్కడా లేని రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో ఇటీవల బాలీవుడ్ హీరో రన్‌బీర్ కపూర్ తన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఈ సినిమా టికెట్లను 10వేల టికెట్లను కొని పేద పిల్లలకు పంచనున్నారు. పేద పిల్లలు ఆదిపురుష్ సినిమా చూసే అవకాశాన్ని కల్పించనున్నారు. దీనితో రామునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నాడు రన్‌బీర్ కపూర్.
ఆదిపురుష్ చిత్ర బృందం కూడా సినిమా విడుదల తర్వాత థియేటర్లో ఒక చైర్ ఖాళీగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. రామున్ని తలచిన చోట హనుమంతుడు తప్పక ప్రత్యక్షమవుతాడనే నమ్మకంతో ప్రతి షో కు ఒక కుర్చీ హనుమంతుని కోసం కేటాయించాలని నిర్ణయించారు. తాజాగా శ్రేయస్ మీడియా కూడా ఆదిపురుష్ సినిమా టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి 101 టికెట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు శ్రేయస్ అధినేత శ్రీనివాస్ ప్రకటించారు. ఇతిహాసాలలో ఒకటైన రామాయణాన్ని సినిమా రూపంలో తెరకెక్కించాడు దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమాకు ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీత పాత్రలో నటించారు. లంకాధిపతిగా సైఫ్ అలీఖాన్ తెరపై కనిపించనున్నాడు. దాదాపు రూ. 500 కోట్ల ఖర్చుతో నిర్మించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న మన ముందుకురానుంది.