ఆడ కావచ్చు, మగ కావచ్చు.. ఓ వయసు రాగానే వారిలో ఆ కోర్కెలు పెరుగుతాయి. పురులు విప్పుతున్న కోర్కెల్ని తీర్చుకోవటానికి కొంతమంది పెళ్లికి ముందే తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా తప్పులు చేయటం నచ్చని వారు హస్త ప్రయోగానికి పాల్పడుతూ ఉంటారు. అయితే, ఆడవారితో పోల్చుకుంటే మగవారే ఎక్కువ శాతం హస్త ప్రయోగం చేస్తూ ఉంటారు. మొదట అలవాటుగా మొదలైన హస్త ప్రయోగం.. తర్వాతి కాలంలో వ్యక్తుల మనస్తత్వం, కోర్కెలను బట్టి వ్యసనంగా మారుతుంది. ప్రతి రోజూ హస్త ప్రయోగం చేసుకోకపోతే ఉండలేనంతగా మారిపోతారు. ఇంకా కొంతమంది రోజులో ఎక్కువ సార్లు హస్త ప్రయోగం చేస్తూ ఉంటారు. హస్త ప్రయోగం ఒక లెవల్ వరకు శరీరానికి మంచి చేస్తుంది. కానీ, అది హద్దు మీరితే మాత్రం విపరీతమైన పరిణామాలు ఉంటాయి. అతిగా హస్త ప్రయోగం చేసుకోవటం వల్ల కలిగే నష్టాలేంటంటే..