ఇంటర్, డిగ్రీ వంటి పైచదువులు అభ్యసించి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉంటున్నారా ..! అయితే మీకో శుభవార్త. జాబ్ మేళా రూపంలో ఉద్యోగం పొందే అవకాశం మీ ముందుకొచ్చింది. చిన్న ఉద్యోగం.. చిన్న కంపెనీ అని నిరుత్సహపడకుండా ఉద్యోగం సాధించి మీ ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసుకోండి..
నిరుద్యోగులకు అలెర్ట్. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి పైచదువులు అభ్యసించి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉంటున్నవారికి గుడ్ న్యూస్. జాబ్ మేళా రూపంలో ఉద్యోగం పొందే అవకాశం మీ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఆక్సిస్ బ్యాంక్, హెటిరో డ్రగ్స్, అపోలో, తనిష్క్ జువెల్లెర్స్, నవతా ట్రాన్స్‌పోర్ట్, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్.. వంటి 12 ప్రముఖ కంపనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నానున్నాయి. మొత్తం 840 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆక్సిస్ బ్యాంక్: ఈ సంస్థలో మొత్తం 45 ఖాళీలున్నాయి. లోన్స్ డిపార్ట్మెంట్, రిలేషన్ షిప్ ఆఫీసర్(ఆర్ఓ), రిలేషన్ షిప్ ఎక్సుక్యూటివ్(ఆర్ఈ) విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లిస్తారు. పిడుగురాళ్ల, గుంటూరు , విజయవాడ, ఏపీ, తెలంగాణలో ఎక్కడైన పని చేయాల్సి ఉంటుంది.
తనిష్క్ జువెల్లెర్స్: ఈ సంస్థలో 15 ఖాళీలున్నాయి. రిటైల్ సేల్స్ ఆఫీసర్ప విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్, ఆపై చదువులు పూర్తి చేసిన వారు అర్హులు. నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఎంపికైన వారు గుంటూరులో పనిచేయాల్సి ఉంటుంది.
హెటిరో డ్రగ్స్: ఈ సంస్థ మొత్తం 100 మందిని రిక్రూట్ చేసుకోనుంది. జూనియర్ కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, బీ/ఎం ఫార్మసీ అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం చెలిస్తారు.
అపోలో: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్/ఫార్మసీ అసిస్టెంట్/ఫార్మసీ ట్రైనీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎం/బీ/డీ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఎంపికైన వారు గుంటూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
నవతా ట్రాన్స్‌పోర్ట్: ఈ సంస్థలో మొత్తం 45 ఖాళీలున్నాయి. లోడింగ్, అన్ లోడింగ్ క్లర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.9500 నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు మెషిన్ ఆపరేటర్ గా పనిచేయాల్సి ఉంటుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, బీటెక్ అభ్యర్థులు అర్హులు.
జాబ్ మేళా జరుగు తేదీ: ఫిబ్రవరి 25(ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది).
జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం: అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలకు అభ్యర్థులు 9160200652, 9010585360, 9866822697 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@AP_Skill – @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mega Job Mela at Agriculture Market Yard Near RTC Bus Stand #Piduguralla #PalnaduDistrict
Registration Link:https://t.co/ex00Gsyqs5
Contact:
9160200652
9010585360
9866822697
APSSDC Helpline – 9988853335 pic.twitter.com/Wu77g3Xhoe— AP Skill Development (@AP_Skill) February 22, 2023