ఆంధ్రప్రదేశ్ రాష్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా వైయస్సార్ జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత పోస్టులను అనుసరించి ఏడవ తరగతి, లేదా పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
మొత్తం ఖాళీలు: 115
విద్యార్హతలు:
అంగన్వాడి వర్కర్ పోస్టులకు పదో తరగతి అరహతా కాగా, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
జూలై 1,2023 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్.
మొదట సంబంధిత వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకొని.. దానిని పూరించిన అనంతరం దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అందజేయాలి.
ఎంపిక విధానం:
ఏడో తరగతి, పదవ తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2023
ఇంటర్వ్యూలు జరుగు తేదీ: 11/02/2023 ఉదయం 11.00 గంటలకు.
ఇంటర్వ్యూలు జరుగు ప్రదేశం: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం.