ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే ఇళ్లు గడవడం కష్టంగా మారింది. అయితే ఇద్దరూ ఉద్యోగాలు, పనులకు వెళ్లిపోతే చిన్న పిల్లలు, పెద్దవారిని చూసే వారుండరు. కాబట్టి.. మహిళలు ఇంటి వద్దనే ఉండిపోతున్నారు. అయితే సొంత గ్రామం, ఊరిలో ఉంటూనే చేసుకునే ఉద్యోగాలు దొరికితే.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలైతే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా వైయస్సార్ జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత పోస్టులను అనుసరించి ఏడవ తరగతి, లేదా పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, దరఖాస్తు […]