ఐపీఎల్ 2022లో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అదరగొట్టాడు. తనకు మాత్రమే సాధ్యమైన సూపర్ ఫినిషింగ్‌తో చెన్నైకు ఈ సీజన్‌లో రెండో విజయం అందించాడు. 19వ ఓవర్ వరకు ముంబై ఇండియన్స్ చేతుల్లోనే కనిపించిన మ్యాచ్.. ధోని పవర్ హిట్టింగ్‌తో చెన్నై వశమైంది. 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన దశలో.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఉనద్కట్‌కు బంతి అందించాడు.
కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ.. ఉనద్కట్ తొలి బంతికే వికెట్ అందించాడు. రెండో బంతికి ఒక్క పరుగుల మాత్రమే వచ్చింది. దీంతో 4 బంతుల్లో 16 పరుగులు అవసరం అయ్యాయి. స్ట్రైక్‌లో ధోని ఉన్నాడు.. ఇంకేముంది. మూడో బంతి సిక్స్, నాలుగో బంతి ఫోర్, ఐదో బంతికి రెండు పరుగులు.. చివరి బంతికి ఫోర్ కొట్టి ధోని మ్యాచ్‌కు షాకింగ్ ఫినిషింగ్ ఇచ్చాడు. ధోనీ ఇన్నింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.
చెన్నై ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ తలైవా ఆడిన షార్ట్ అండ్ స్టన్నింగ్ నాక్‌కు సంబరపడిపోతుంటే.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాత్రం డిఫరెంట్ స్టైల్లో దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీకి ప్రచారం కల్పించేందుకు ధోని ఆడిన ఫినిషింగ్ నాక్‌ను వాడేసుకున్నారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో ధోని ఫోటోను షేర్ చేస్తూ.. ధోని క్రీజ్‌లో ఉన్నప్పుడు, ఆర్టీసీ సీట్‌లో ఉన్నప్పుడు ఎలాంటి దిగులు ఉండదంటూ సూపర్ కోటెషన్ యాడ్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో జరుగుతున్న కీలక సంఘటనలను వాడుకుంటూ ఆర్టీసీకి ప్రచారం కల్పిస్తున్నారు సజ్జనార్. ఆయన ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా కూడా వందశాతం మనసు పెట్టి పని చేస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్టీసీ అభివృద్ధిలో కూడా ఆయన తన మార్క్ చూపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL లైవ్ ఫ్రీగా చూసేందుకు హాట్ స్టార్ నే హ్యాక్ చేశాడు!
ధోని క్రీజ్ లో ఉన్నప్పుడు, TSRTC బస్సు సీట్లో ఉన్నప్పుడు ఎలాంటి దిగులు ఉండదు.#Thala #ThalaDhoni #Dhonism #CSK𓃬 #MSDhoni #CSKvsMi #ChennaiSuperKings #MSDhoni𓃵 #IPL #TSRTCBus pic.twitter.com/QOw9FKuTwZ
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.