శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఎంతో సులువుగా మ్యాచ్‌ను గెలిచేసింది. అంతేకాకుండా 14 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. మ్యాచ్ ఫలితం చూశాక కోహ్లీ ఒకింత అసహనంగానే కనిపించాడు. స్వతహాగానే హైపర్ యాక్టివ్‌గా ఉండే కోహ్లీ మ్యాచ్ తర్వాత కాస్త డల్‌గా కనిపించాడు. కొద్దిసేపటికే కోహ్లీ అభిమానులను షాక్ గురిచేశాడు. కోహ్లీ చేసిన పనికి మొత్తం విరాట్, ధోనీ అభిమానులు ఫుల్ కుష్ అయిపోయారు. కెప్టెన్ కూల్ తన టీమ్ సభ్యులతో మాట్లాడుతుండగా కోహ్లీ అక్కడికి వచ్చాడు. ఆ విషయాన్ని ధోనీ పట్టించుకోలేదు. వారితో మాట్లాడుతూ ఉండిపోయాడు. అది గమనించిన కోహ్లీ సైలెంట్‌గా వెనుకనుంచి కౌగిలించుకుంటాడు. ఆ సీన్ చూసిన క్రికెట్ అభిమానులు వారి బాండింగ్ ఎలాంటిదో అర్థం చేసుకున్నారు.
WE JUST CAN’T GET ENOUGH!😍🥳#whistlepodu #CSKvRCB #Dhoni
Screengrab Courtesy: Starsports/IPL pic.twitter.com/Lz5gg3fgwP— Whistle Podu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) September 24, 2021
మ్యాచ్ అనంతరమే కాదు.. మ్యాచ్‌కు ముందు కూడా కోహ్లీ, ధోనీ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. టాస్ కాసేపు ఆలస్యం కావడంతో మైదానంలో కోహ్లీ, ధోనీ సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించారు. కోహ్లీ నవ్వుతూ ధోనీని టీస్ చేస్తూ కనిపించాడు. ఇద్దరూ చాలాకాలం తర్వాత కలిసిన మిత్రుల్లా చెట్టాపట్టాలు వేసుకుని మైదానంలో తిరుగుతూ నవ్వుకుంటూ ముచ్చటించుకున్నారు. ఈ సీన్ చూసిన అభిమానులు వారి ఆనందాన్ని అంతూ సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ మంచి టచ్‌లో కనిపించాడు. 41 బంతుల్లో 53 పరుగులు చేసిన కోహ్లీ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. కోహ్లీ, ధోనీ మధ్య జరిగిన ఆ అద్భుతమైన దృశ్యాన్ని మీరూ చూసేయండి.