బరువు తగ్గించే ప్రక్రియలో అత్యంత కీలకమైంది నడక. రోజూ వాకింగ్ చేస్తే కేవలం బరువు తగ్గడమే కాదు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా లైఫ్‌స్టైల్ వ్యాధులను అరికట్టవచ్చంటారు ఆరోగ్య నిపుణులు. అయితే వాకింగ్ ఎలా చేస్తే మంచిదనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
ఆధునిక జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వీటిలో అధిక బరువు ప్రధాన సమస్య. దీంతోపాటు డయాబెటిస్, రక్తపోటు, గుండె పోటు, కిడ్నీ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే ముందుగా చెక్ పెట్టాల్సింది అధిక బరువుకు. బరువు తగ్గించేందుకు బెస్ట్ మెథడ్ వాకింగ్ మాత్రమే. అయితే వాకింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచిదనేది అతి పెద్ద సవాలు. బ్రిస్క్ వాకింగ్ ఒకటైతే రెండవది నార్మల్ వాకింగ్. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుుడు తెలుసుకుందాం.
బ్రిస్క్ వాకింగ్ వర్సెస్ నార్మల్ వాకింగ్…
వాకింగ్ అనేది కేవలం బరువు తగ్గించేందుకు కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం వాకింగ్ ఉపయోగపడుతుంది. రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల చాలా లాభాలుంటాయి. డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. బ్రిస్క్ వాకింగ్ అంటే వేగంగా నడవడం వల్ల ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనాలుంటాయి. కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. అలసట తగ్గుతుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. నార్మల్ వాకింగ్‌తో పోల్చినప్పుడు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఎండార్ఫిన్లు అధికంగా విడుదలై ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాల సమస్య ఉంటే మాత్రం నార్మల్ వాకింగ్ మంచిది. నార్మల్ వాకింగ్ వల్ల డయాబెటిస్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మానసిక ఆరోగ్యం ఉంటుంది.