ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తే వివిధ రకాల వ్యాధుల్లో ప్రమాదకరమైంది థైరాయిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకుంటే విషంతో సమానమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
జీవనశైలి సక్రమంగా లేకపోయినా, చెడు ఆహారపు అలవాట్లున్నా తరచూ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటాం. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, ధైరాయిడ్ వంటి సమస్యలు ఇటీవల కాలంలో పెరగడానికి కారణం ఇదే. ఇందులో థైరాయిడ్ సమస్య చాలా ప్రమాదకరమైంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలను దూరంగా ఉంచాల్సిందేనంటున్నారు. థైరాయిడ్ సమస్యకు మందులతో పాటు ఫుడ్ డైట్ చాలా ముఖ్యమంది. సాధారణంగా థైరాయిడ్ అనేది దీర్ఘకాలంగా ఉంటుంది. చాలామంది మందులు తీసుకుంటున్నాం కదా అనే ఆలోచనతో పుడ్ నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ థైరాయిడ్ విషయంలో ఫుడ్ డైట్ చాలా అవసరం. కొన్ని రకాల ఆహార పదార్దాలను పూర్తిగా దూరం పెట్టాలి.
చాలామంది ప్యాక్డ్ లేదా ప్రోసెస్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. థైరాయిడ్ రోగుల్లో ఈ పదార్ధాలు బరువుని మరింతగా పెంచుతాయి. శారీరక సమస్యలు పెరుగుతాయి. అందుకే ఈ పదార్ధాలను దూరంగా పెట్టాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు కాఫీ ఎక్కువగా తాగకూడదు. ముఖ్యంగా పరగడుపున అస్సలు సేవించకూడదు. థైరాయిడ్ మందులు తీసుకునే క్రమంలో అయితే కనీసం గంట గ్యాప్ ఇవ్వాలి. లేకపోతే సమస్య మరింత ముదురుతుంది.
సోయా బీన్స్, సోయా ఉత్పత్తులు డైట్‌లో ఉండకూడదు. క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇక స్వీట్స్ అయితే దరిచేరకూడదు. షుగర్ పూర్తిగా మానేస్తే మంచిది. బరువు ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రపు ఎండలో కనీసం 40 నిమిషాలు వాకింగ్ చేయాలి.