హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పర్వదినాన పిల్లలు, పెద్దలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. పూజ గదిని అలకరించి, ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లను పూజిస్తారు. అనంతరం ఊరిలో ఉండే వివిధ దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇదే సమయంలో ఊర్లో ఉండే గ్రామ దేవలతలు పూజలు చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మరి సంక్రాంతి పండగ రోజున గ్రామా దేవతలు ఏ విధంగా పూజించాల్లో.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా గ్రామ దేవతలు అంటే ఎంతో శక్తివంతమైన వారని భక్తులు నమ్ముతుంటారు. అంకాళమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, మైసమ్మ, పోచమ్మ తల్లి వంటి పేర్లతో గ్రామదేవతలను పిలుచుకుంటారు. ఇలా వివిధ పేర్లతో ఉండే ఈ గ్రామ దేవతలకు భక్తులు నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు గ్రామదేవతలకు పట్టు వస్త్రాలు, గాజులు, పూలు వంటివి సమర్పింస్తారు. కోరిన కోర్కెలు తీర్చే శక్తిమూర్తులుగా భావించి పూజిస్తుంటారు. పెద్దలు సంప్రదాయలను అనుసరించి గ్రామనికి రక్షణగా ఈ దేవతలను ఊరి పొలి మేరల్లో ఏర్పాటు చేసేవారు. దూర ప్రాంతాల్లో ఉండే అమ్మవార్లను దర్శించుకోలేని వారు.. ఈ గ్రామదేవతలను దర్శించుకుంటారు.
తమ ఆరోగ్య సమస్యలు, ఇతర కష్టాల నుంచి కాపాడేది గ్రామదేవతలే అని భక్తుల విశ్వాసం. అయితే మాములుగానే ఈ దేవతలను పూజిస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. అలానే సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరిస్తుంటారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. అలానే మహిళలు మకర సంక్రాంతి పర్వదినాన గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తే.. కష్టాలు తొలగిపోతాయని పురాణలు చెబుతున్నాయి. గ్రామ దేవతలకు ఇష్టమైన రీతిలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తే.. అమ్మ కరుణించి.. మనల్ని కష్టాల నుంచి గట్టేకిస్తుంది. సంక్రాంతి పండగ రోజును ఇంటిని శుభ్రం చేసుకుని, గడపలను పసుపు కుంకుమలతో అలకరించాలి.
అలానే పూజా మందిరాని శుభ్రం చేసి పూలతో అలకరించాలి. గుమ్మాలకు మామిడి తోరణాలతో కట్టి పూలతో అలకరించాలి. అనంతరం ఇంట్లోనే దేవుళ్లకు పూజలు నిర్వహించి.. నైవేద్యాలు సమర్పించాలి. ఇలా ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తైన తరువాత ఊరిల్లోని గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లాలి. అక్కడ కూడా అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. గ్రామదేవతలకు చీర, గాజులు, బొట్టు పెట్టి అలంకరించాలి. ఆ తరువాత అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు పాడుతూ పూజలు నిర్వహించాలి. మనం తయారు చేసిన చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా గ్రామదేవతలకు సమర్పించాలి.
కొంత సమయం పాటు గ్రామదేవతల ఆలయ ప్రాంగణంలో గడపాలి. ఈ విధంగా మకర సంక్రాంతి రోజు గ్రామదేవతలను పూజి చేస్తే.. సాధారణ రోజుల్లో చేసే పూజలకు మించిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంక్రాంతి పర్వదినాన గ్రామదేవతలు పూజలు చేస్తే.. మీ కష్టాలన్నీ తొలగిపోయి అంత శుభం జరుగుతుంది. ఈ పండుగ వేళ్లో గ్రామదేవతలను నిష్ఠతో పూజించే కోరికలు కోరితే.. వెంటనే నేరవేరుతాయి. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.