హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పర్వదినాన పిల్లలు, పెద్దలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. పూజ గదిని అలకరించి, ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లను పూజిస్తారు. […]