మనం నిత్యం అనేక మంది దేవుళ్లను పూజిస్తుంటాము. అందులోనూ ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని కొలుస్తుంటారు. అయితే అందరికి తెలిసిన మనిషి రూపంలో కష్టాలు పడిన దేవుడు శ్రీరాముడు. కొడుకుగా, భర్తగా, రాజు, అన్నగా, తండ్రిగా ఇలా ఆయన ఎంతో మందికి ఆదర్శం. రాముల వారికి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రాముడి పరమభక్తుడైన హనుమంతుడికి కూడా అనే ఆలయాలు ఉన్నాయి. ఆంజనేయుడిని తలుచుకుంటే.. ఎలాంటి దృష్ట శక్తులు దగ్గరకు రావని భక్తుల నమ్మకం. అయితే హనుమాన్ తలుచుకుంటే పుణ్యం వస్తుందని అందరూ భావిస్తుంటే.. ఓ గ్రామం మాత్రం ఆయన పేరు తలచకుంటేనే నేరంగా భావిస్తున్నారు. హనుమంతుడికి పూజలు చేయడం తప్పుగా పరిగణిస్తారు. మరి వారు ఆంజనేయుడి పూజను నేరంలా భావించడానికి కారణంలేంటో తెలుసుకుందాం..
మనకు వారు అంతలా ద్వేషించడానికి కారణం తెలియాలంటే ఒక్కసారి రామాయణలోకి వెళ్లాల్సిందే.. రామాయాణంలో రామ రావణ యుద్ధం జరిగే సమయంలో.. రావణాసురుడి తనయుడు మేఘనాథుడితో లక్ష్మణుడు యుద్ధం చేస్తుంటాడు. ఆ సమయంలో మేఘనాథుని బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. దీంతో సంజీవని తీసుకుని రమ్మనమని హనుమంతుడికి సూచిస్తారు అక్కడి పెద్దలు. ఆ తర్వాత ఆంజనేయుడు సంజీవని కోసం హిమాలయ పర్వతాలలో ఉన్న ఓ ప్రదేశానికి వెళ్లి.. అక్కడ అని మూలికలు ఒకేలాగా ఉంటడంతో ఏకంగా కొండనే తీసుకుని వచ్చేస్తారు. ఇది రామాయణం ద్వారా మనకు తెలిసిన కథ.
అయితే ఆంజనేయుడు సంజీవని కోసం తీసుకెళ్లిన కొండ ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని చమోలిలో ఉన్న ద్రోణగిరి గ్రామం. ఈ గ్రామ సమీపంలో నుంచే ఆంజనేయుడు సంజీవని పర్వతానికి తీసుకెళ్లాడు. సంజీవనిని దూరం చేశాడనే భావనతో హనుమంతుడు అంటే వీళ్లకు నచ్చదు.. ఈ గ్రామంలో హనుమంతుడికి ఒక్క గుడి కూడా లేదు.. కనీసం పేరు కూడా పలకరు.. నేటికీ ఈ గ్రామంలో హనుమంతుని పూజించడం నేరంగా పరిగణించబడుతుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.