మనిషిని మృత్యువు ఎప్పుడు ఎలా వెంటాడుతుందో తెలియదు.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో కూల్ గా మాట్లాడిన వారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మరణిస్తున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో మరణిస్తున్న విషయం తెలిసిందే. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని యువత హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. కారణాలు ఏవైనా ఇలా వరుస గుండెపోటు మరణాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు కరోనా మళ్లీ మొదలైందని వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడు ఈ గుండెపోటు మరణాలతో ప్రజలు క్షణం క్షణం భయంతో వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఎక్కడో అక్కడ హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. ఏపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గురజాల దాచేపల్లి మండలం ముత్యాలంపాడు కు చెందిన వైసీపీ సీనియర్ నేత బాలినేని వెంకట్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. గత కొంతకాలంగా ముత్యాలంపాడు గ్రామంలో బాలినేని వెంకట్ రెడ్డి వైసీపీ నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అందరికీ తెలియజేస్తూ.. అందరితో కలుపుగోలుగా ఉండే బాలినేని వెంకట్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
వైసీపీ సీనియర్ నేత బాలినేని వెంకట్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, గ్రామస్థులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కారణాలు ఏవైనా గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటు మరణాలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. ఒకరకంగా గుండెపోటు పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.