అందమైన భార్య.. మంచి కుటుంబం.. కొడుకు.. సజావుగా సాగుతన్న జీవితం.. అయితే భార్య అందం.. అతడికి నిద్ర లేకుండా చేసింది. భార్య ఎవరితో మాట్లాడుతుంది.. ఎక్కడికి వెళ్తుంది.. అంటూ అనుమానం పెంచుకోసాగాడు. భార్య అలాంటిది ఏం లేదని ఎన్ని సార్లు చెప్పినా అతడు వినలేదు.. అనుమానం అతడి మనసులో విషం నింపింది. అనుమానం పెరిగి పెరిగి.. పెద్దదయ్యింది. చివరకు భార్యను అంతం చేసే దిశగా అతడిని పురిగొల్పింది. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది. ఆ వివరాలు..
పశ్చిమ బెంగాల్, సిలిగురి సబ్‌డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న రేణకా ఖాతూన్, మహ్మద్ అన్సారుల్‌కి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు సిలిగురి వార్డ్ నెం.43లోని దాదాభాయ్ కాలనీలో నివాసం ఉండేవారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. రేణుక.. అదే ప్రాంతంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని నేర్చుకునేందుకు వెళ్లడం ప్రాంరభించింది. ఇక గత కొన్నాళ్లుగా మహ్మద్‌కు రేణకపై అనుమానం మొదలయ్యింది. ఆమె ఎక్కడికి వెళ్తుంది.. ఏం చేస్తుంది.. ఎవరితో మాట్లాడుతుంది అంటూ వేధించేవాడు. దీనిపై ఇద్దరి మధ్య తరచు గొడవలవుతుండేవి. ఈ క్రమంలో.. డిసెంబర్ చివరి వారం నుంచి రేణుక కనిపించలేకుండా పోయింది. దీని గురించి తల్లిదండ్రులు డిసెంబర్ 24న.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్సారుల్‌ని అదుపులోకి తీసుకుని తమశైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు విషయం చెప్పాడు అన్సారుల్. డిసెంబర్ 24న తనకు, రేణకకు మధ్య గొడవ జరిగిందని.. ఆ కోపంలో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి.. ఛత్ పక్కనే ఉన్న కాలువలోకి పడేసినట్లు.. వెల్లడించాడు. ప్రస్తుతం పోలీసులు రేణుక మృతదేహం.. కోసం గాలిస్తున్నారు. ఇక తమ కుమార్తెని.. దారుణంగా హత్య చేసిన అన్సారుల్‌కి ఉరిశిక్ష వేయాలని రేణుకు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి అనుమానంతో.. అందమైన జీవితాన్ని నాశనం చేసుకున్న మహ్మద్ నిర్ణయం సరైందే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.