వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని భావించి ఇదే విషయాన్ని ఇరువురి తల్లిదండ్రులకు వివరించారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది విజయనగరం జిల్లా సీతానగరం మండలం బగ్గందొరవలస. ఇదే గ్రామానికి చెందిన స్రవంతి అనే యువతి ఇంటర్మీడియట్ చదువుతుండగా శ్రీను అనే యువకుడు స్థానికంగా కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. అయితే వీరిద్దరికి పరిచయం ఉండడంతో కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఇరువురి తల్లిదండ్రలుకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు కూతురికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఒక ఇద్దరు ఓ చోట చేరి.., కలిసి బతకలేకున్న కలిసి చనిపోదామని అనుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే హుటాహుటిన వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికత్స అందించిన వైద్యులు వారిని ప్రాణపాయం నుంచి కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పెళ్లికి అంగీకరించలేదని పురుగుల మందు తాగిన ఈ జంట నిర్ణయం ఎంత వరకు కరెక్ట్? ఇలాంటి వారికి మీరిచ్చే సలహ ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.