ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతన్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమా, గీమా అంటూ ఈ కాలంలోని కొందరు అమ్మాయిలు చెడు తిరుగుళ్లు తిరుగుతన్నారు. ఇక ప్రియుడితో సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా తన ప్రేమకు ఇంట్లో వాళ్లు అడ్డుచెబితే చంపడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కూతురు కన్న తండ్రిని కత్తితో దాడి చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
విశాఖలోని శంకరమఠంలో ఓ 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు ఉంటూ స్థానికంగా ఇంటర్ చదువుతుంది. అలా చదువుకుంటున్న రోజుల్లోనే ఆ బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. దీంతో ఇద్దరు సినిమాలు, షికారు అంటూ రోజులు గడిపారు. ఇక ఇంతటితో ఆగని ఆ బాలిక తన ప్రియుడు అడిగినప్పుడల్లా ఇంట్లో నుంచి తండ్రికి తెలియకుండా ఏకంగా రూ. 2 లక్షల నగదుతో పాటు బంగారు అభరణాలు కూడా ముట్టజెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తండ్రి కూతురుని నిలదీశాడు. ఇదే విషయమై తండ్రి, కూతురు మధ్య గొడవ జరిగింది.
ఇక కోపంతో ఊగిపోయిన ఆ బాలిక ఇంట్లో ఉన్న కత్తితో తన తండ్రిపై దాడికి పాల్పడింది. దీంతో వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలికను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిని కత్తితో పొడిచిన ఈ కిరాతక కూతురుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.