నడిరోడ్డుపై వెళ్లున్న ఓ దంపతులను ఇద్దరు యువకులు వేధించారు. ఆ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. అందరూ చూస్తుండగా మహిళ అని చూడకుండా దారుణానికి పాల్పడ్డారు.
దేశంలో మహిళలపై రోజుకొక చోట దారుణాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. వావి వరుసలు మరిచి అత్యాచార దాడులు తెగబడుతున్నారు. ఇంతటితో ఆగకుండా కోరిక తీర్చాలని వెంటపడుతూ.. చివరికి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా మద్యం మత్తులో యువకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. కోరికలు తీర్చాలంటూ వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు.
అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే కొందరు యువకులు గంజాయి మత్తులో గలీజ్ పనికి కాలు దువ్వారు. పట్టపగలు నడి రోడ్డుపై దంపతులను అడ్డగించారు. ఆ తర్వాత వారితో మాటా మాటా కలిపి చివరికి అసభ్యకరంగా ప్రవర్తించారు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం… ఏపీలోని విశాఖపట్నం జిల్లా పూర్ణామార్కెట్ పరిధిలో ఉన్న రంగిరీజు విధిలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 6 ఏళ్ల కూతురు కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఈ దంపతులు ఈ నెల 15న షాపింగ్ కోసమని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే వీర్రాజ్, సంపత్ అనే ఇద్దరు యువకులు మద్యం, గంజాయి సేవించి బైక్ పై వస్తున్నారు. ఈ దంపతులను గమనించిన ఆ యువకులు.. వెనకాల నుంచి బైక్ హారన్ కొడుతు హల్చల్ చేశారు. ఆ యువకుల తీరుతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ భర్త.. వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ యువకులు మరింత రెచ్చిపోయి.. ఆ మహిళ భర్తపై దాడి చేసి అతడి బట్టలు చించేశారు.
ఇంతటితో సరిపెట్టని ఆ దుర్మార్గులు.. ఆ మహిళతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించారు. పైగా ఆమె బట్టలు కూడా చించేశారు. దీంతో తట్టుకోలేకపోయిన ఆ మహిళ.. దగ్గర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా.. ఓ వ్యక్తి ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకులతో గొడవకు దిగాడు. అయినా వెనక్కి తగ్గని ఆ యువకులు.. అతడిపై కూడా దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక దీనిని సహించలేకపోయిన ఆ దంపతులు కోపంతో ఊగిపోయారు. ఇక అక్కడి నుంచి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని యువకుల దారుణంపై ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు వీర్రాజ్, సంపత్ లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వారి వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తొందర్లోనే వారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపినట్లు బాధితులు తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంగా మారింది. గంజాయి మత్తులో మహిళను కూడా పట్టపగలు నడి రోడ్డుపై బట్టలు చించేసిన ఈ యువకుల దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.