గుడిసెలో నిద్రిస్తున్న ఓ తల్లీ కూతురు ఉన్నట్టుండి కాలి బూడిదయ్యారు. ఇదే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?
గుడిసెకు నిప్పు అంటుకున్న ఘటనలో ఓ తల్లీ కూతురు కాలి బూడిదయ్యారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు తల్లీ కూతురు గుడిసెలో ఎలా చనిపోయారు? వారున్న గుడిసెకు ఎవరైనా నిప్పు పెట్టారా? లేక వారే నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారా? ఈ ఘటనలో అసలేం జరిగింది? గ్రామస్తులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.
అది ఉత్తర్ ప్రదేశ లోని డెహట్ జిల్లా కాన్పూర్ లోని మౌడలి గ్రామం. ఇక్కడే 45 ఏళ్ల మహిళ, తన 20 ఏళ్ల కూతురితో పాటు గుడిసెలో నివాసం ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి స్థానిక అధికారులు కాన్పూర్ ఏరియాలోని కొన్నిప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చి వేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే గుడిసెలో ఉంటున్న ఆ తల్లీ కూతురు ఇటీవల కాలిబూడిదై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాష్ట్ర పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లీ కూతురు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వాళ్లిద్దరూ గుడిసెలో ఉండగానే స్థానిక పోలీసులు దానికి నిప్పు పెట్టారని ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం.. ఆ తల్లీ కూతురు కలిసే వారి గుడిసెకు నిప్పు పెట్టుకున్నారని తెలిపారు. అనంతరం ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు ఉన్నతాధికారులు.. ఏకంగా 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై గ్రామస్తులు.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అధికారులు అక్రమ కట్టడాలు కూల్చి వేశారని, వీరి వైఫల్యం కారణంగానే అమాయక తల్లీ, కూతురు చనిపోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వీరి మరణానికి కారణమైన అధికారులను, పోలీసులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.