అది వాయువ్య ఫ్రాన్స్‌లోని లేమాన్స్ ప్రాంతం. ఓ మహిళ ఇద్దరు ఐదు, ఆరు సంవత్సరాలున్న పిల్లలతో పాటు ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. పని చేసుకుంటూ ఎదో రకంగా అలా ఇద్దరు పిల్లలను సాకుకుంటు వస్తుంది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి పిల్లలతో పాటు తల్లి కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అయితే అదే రాత్రి నిద్రలోనే తల్లి హాఠాత్తుగా మరణించింది. ఇక పిల్లలు ఉదయం నిద్రలేచి ఆడుకుంటు ఉన్నారు.
కానీ తల్లి ఇంకా నిద్రలేవకపోవటంతో అమ్మ నిద్రలో ఉందని, ఇంక నిద్రలేవలేదని అనుకుంటు ఉన్నారు. అలా సదరు పిల్లలు కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లటం పూర్తిగా మానేశారు. దీంతో పాఠశాల టీచర్స్ తల్లికి సమాచారం అందేంచేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి రిప్లయ్ రాలేదు. ఎందుకో కాస్త అనుమానం రావటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు ఇంటికెళ్లి చూస్తే ఆ మహిళ చనిపోయిందని తెలుసుకున్నారు. ఇక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పిల్లలను చికిత్స అందిస్తున్నారు. తల్లిది సహజ మరణమని వైద్యులు తెలిపారు. తాజాగా జరిగిన ఈ హృదయ విదారకమైన ఘటన కన్నీళ్లు పెట్టిస్తుంది.