ఒకే మహిళతో ఇద్దరు మగాళ్ల ఎఫైర్.. ఇది చినిగి చినిగి చివరికి గ్రామ పెద్దల వరకు వెళ్లింది. బట్టబయలైన ఈ వివాహేతర సంబంధంలో ఇప్పుడు గ్రామ పెద్దల తీర్పు సంచలనంగా మారి చివరికి యువకుడు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లింది. అసలు పంచాయితీలో ఇచ్చిన పెద్దల తీర్పు ఏంటీ? ఆ తీర్పు కారణంగా యువకుడి బలవన్మరణానికి పాల్పడటానికి ఏర్పడ్డ పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం నాగులపల్లి గ్రామం. ఈ ఊరిలో గూడవల్లి శ్రీనివాస్ అనే యువకుడు పంగిడిగూడెంకు చెందిన మహిళతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఇదే మహిళతో శ్రీనివాస్ కు తెలియకుండా అనుమాలగూడెంకు చెందిన అప్పరావు అనే వ్యక్తి కూడా తెర వెనుక సంసారానికి అలవాటు పడ్డాడు. దీంతో ఒకిరికి తెలియకుండా మరొకరు ఆ మహిళతో చికటి సంసారానికి పునాదులు వేశారు. అయితే ఈ విషయం కొన్ని రోజులకు అప్పారావుకి తెలిసిపోయింది.
దీంతో అక్టోబర్ 19న శ్రీనివాస్ ఆ మహిళను కలిసేందుకు వచ్చాడు. కాగా శ్రీనివాస్ రాకను గమనించిన అప్పారావు కాపుగాసి అతనిపై దాడికి ప్రయత్నించాడు. ఈ గొడవ చినిగి చినిగి చివరికి పంచాయితీ పెద్దల వరకు వెళ్లింది. దీంతో సమయం చూసుకుని బట్టబయలైన ఈ వివాహేతర సంబంధంలో పెద్దలు తీర్పుకు రెడీ అయ్యారు. ఇక పెద్దల విచారణలో ఊహించని విధంగా శ్రీనివాస్ కు రూ.70వేలు, అప్పారావుకు రూ.50వేల జరిమానా విధించారు. విధించిన జరిమానాను కట్టడానికి ఇద్దరికి కొంత సమయాన్ని ఇచ్చారు.
ఆ సమయం దాటుకుని వస్తున్న శ్రీనివాస్ ఇంత వరకు పెద్దలు ఇచ్చిన జరిమానా కట్టలేకపోయాడు. జరిమానా కోసం వేధింపులు ఎక్కువ కావడంతో శ్రీనివాస్ మనస్తాపానికి గురై ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీంతో పాటు తీర్పు ఇచ్చిన గ్రామ పెద్దలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పంచాయితీ పెద్దల తీర్పుతో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.