హైదరాబాద్ నగర పరిధిలో కాల్పులు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్కార్పియో కారుపై కాల్పులు జరపగా స్థిరాస్తి వ్యాపారులు రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతి చెందారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణంగూడకు వెళ్లే మార్గంలో ఓ స్కార్పియో వాహనాన్ని స్థానికులు గుర్తించారు. అందులో ఓ వ్యక్తి స్పృహ తప్పి కనిపించగా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన రాఘవేందర్ ను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చుట్టూ గాలించగా అక్కడే శ్రీనివాసరెడ్డి మృతి చెంది కనిపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాఘవేందర్ రెడ్డి కూడా మరణించాడు. బండి నంబరు ప్లేట్ ఆధారంగా మృతుడు స్థిరాస్తి వ్యాపారిగా గుర్తించారు. అసలు హత్య జరగడానికి కారణం వ్యాపారానికి సంబంధించిందేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రూ 22 ఎకరాల్లో వెంచర్ వేశారు. ఆ వెంచర్ విషయంలో వారికి గొడవలు ఉన్నాయి. మట్టారెడ్డి మాట్లాడేందుకు రమ్మన్నాడని రఘు, శ్రీనివాసరెడ్డి తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.