సమాజంలో ఆడవాళ్లపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉయ్యాలోని పసి పాప నుంచి మంచంలోని ముసలమ్మ దాకా వారి కామవాంఛలకు బలైపోతూనే ఉన్నారు. కామాంధుల కోరికకు మరో ప్రాణం పోయింది. సెక్షన్లు, శిక్షలు, ఎన్ కౌంటర్లు ఇలా ఏవీ.. ఆ కామాంధులను ఆపలేకపోవడం దారుణం. వారి కోరిక తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఈ ఘటనలో నలుగురు కామాంధుల వాంఛకు ఓ యువతి బలైపోయింది. ఆమెను అత్యాచారం చేయగా.. ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రాణం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా ఆరేలులో చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ యువతి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఎవరికి చెబితే ఎలా స్పందిస్తారో? పరువు పోతుంది.. అని ఆలోచించిందో ఏమో. బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆ విషయం గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది.
యువతి రాసిన సూసైడ్ నోట్ తో అసలు విషయం వెలుగు చూసింది. అప్పటి వరకు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ తెలియదు. ఆమె తన కష్టాన్ని చెప్పుకోలేదు కూడా. కానీ, ఆ నోట్ లో నిందితుల పేర్లు ప్రస్తావించింది. వాళ్లు ఆమెను ఆగం చేశారంటూ తెలిపింది. వారిని చెప్పుతో కొట్టాలంటూ తెలిపింది. పోలీసులు యువతి రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ యాట సాగర్, అతని మిత్రలు నజీం, సద్దాం హుస్సేన్, జగదీష్ అంటూ తెలిపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
యువతి మృతి చెందడం.. గ్యాంగ్ రేప్ అంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గ్రామంలో ఉద్రిక్తలు నెలకొనకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఒకరు ప్రజాప్రతినిధి, మరొకరు కానిస్టేబుల్ అని కూడా తెలుస్తోంది. నలుగురు ఆమెపై అత్యాచారం చేయడంతోనే ఆ అవమానం భరించలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.