కొందరు యువతి యువకులు సమస్యకి పరిష్కారం చావే అనుకునే ధోరణిలో ఉన్నారు. తమ నిర్ణయాలను ధైర్యంగా చెప్పి సమస్యను పరిష్కారించుకునే ప్రయత్నం చేయట్లేదు. చివరికి చిన్నపాటి సమస్యను కూడా పెద్దగా ఊహించుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా పెళ్లి చూపులు ఇష్టం లేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..
కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన కొప్పురపు శ్రీనివాసులు, భారతి దంపతుల కుమార్తె వైష్ణవి(26) అనంతపురం జిల్లా యాడికి మండలం చందనపల్లె గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు సెలవు తీసుకోని తన స్వగ్రామమైన కొలిమిగుండ్లలో ఉంటోంది. వైష్ణవి తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయాలనే ఆలోచనతో తమకు తెలిసిన వారితో మంచి సంబంధం కోసం చూస్తున్నారు.
ఈ క్రమంలో పెళ్లిచూపులు చూసేందుకు రెండు మూడు రోజుల్లో వస్తున్నారని వెష్ణవికి ఆమె తల్లిదండ్రులు చెప్పారు. కానీ పెళ్లి చూపులు ఇష్టం లేని వైష్ణవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.