వివాహేతర సంబంధాల్లో పడి కొంతమంది పెళ్లైన మహిళలు భర్తను, పిల్లలను కాదని ప్రియుడితో పాటు వెళ్తున్నారు. అతడే సర్వస్వమంటూ భర్తను కాదని వెళ్తూ చివరికి అతడి చేతుల్లోనే చనిపోతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని ప్రీతి అనే మహిళకు గతంలో పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. భర్త, పిల్లలతో పాటు వారి జీవితం సంతోషంగా సాగుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే భర్త మేనత్త కుమారుడు మేనబావ కిరణ్ పై కొన్నాళ్ల నుంచి మనసు పడింది. ఇద్దరు మాట్లాడుకోవడం కూడా చేస్తున్నారు.
భర్తకి తెలియకుండా బయట కలవడం, తిరగడం చేస్తున్నారు. ఇక కొన్నాళ్లకి ఈ విషయం బయటకు రావడంతో భర్త వరకు వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త రిపీట్ కావద్దంటూ హెచ్చరించాడు. ఇదే విషయాన్ని ప్రీతి బావ కిరణ్ కు చెప్పింది. ఇక నాతో వచ్చేయ్ అంటూ చెప్పడంతో భర్తను, పిల్లలను కాదనుకుని మోజుపడ్డ బావతో వెళ్లిపోయింది. దీంతో కొన్నాళ్ల పాటు సంతోషంగా గడిపారు. ఇక రోజులు గడిచే కొద్ది కిరణ్ మరదలిపై ప్రేమ రోజు రోజుకు తగ్గుతు వచ్చింది.
చివరికి ప్రీతి సైతం ఇదే విషయాన్ని కిరణ్ ను పలుమార్లు అడిగింది. అయినా దానికి కిరణ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దీంతో అనేక సార్లు ప్రీతి ఇదే విషయాన్ని అడగడంతో కిరణ్ ఆగ్రహానికి లోనయ్యాడు. ఇక ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. కోపంతో ఊగిపోయిన కిరణ్ మరదలు ప్రీతిపై బలంగా కడుపుతో తన్నటం, గోడకేసి కొట్టడం చేశాడు. ఈ గొడవ అల్లరి బయటకు వెళ్లటంతో స్థానికులు వచ్చి చూసేలోపు రక్తపుమడుగులో పడి ప్రీతి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.