నేటి కాలంలో పెళ్లైన కొందరు వివాహితలు పక్కదారి పడుతు వివాహేతర సంబంధాలకు సై అంటున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. ఏకంగా భర్తను, పిల్లలను కాదని ఎంచక్క ప్రియునితో సరసాలు, లేదంటే అతనితోనే వెళ్లిపోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుతూ వివాహ బంధాలకున్న విలువలకు తూట్లు పొడుస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే హర్యానాలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..కర్నాల్‌కు సమీపంలోని ఘోగ్రిపూర్ గ్రామంలో నివాసం ఉండే పరమ్‌జిత్ కౌర్, మనోజ్ అనే ఇద్దరు భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలా ఏళ్లే గడుస్తుంది. దీంతో వీరి కాపురం కూడా ఎంతో సంతోషంగా సాగుతు వచ్చింది. కొంత కాలానికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సైతం జన్మించారు. కానీ రోజులు మారుతున్న కొద్ది భార్య పరమ్‌జిత్ కౌర్ ప్రవర్తనలో మార్పులు వస్తూ ఏకంగా వక్రమార్గంలోకి వెళ్లి పక్కచూపులు చూసింది.
అసలు విషయం ఏంటంటే..? తన భర్త తమ్ముడిపైనే మనసు పారేసుకుని ఏకంగా వివాహేతర సంబంధానికే శ్రీకారం చుట్టింది. భర్తకు తెలియకుండా కొన్నాళ్ల పాటు తెర చాటు సంసారంలో ఇద్దరు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇక దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక పిల్లలు, భర్త వీరికి అడ్డుగా ఉండడంతో వీరికి ఏం చేయాలో అర్థం కాలేదు. సమాజంలో మా బంధాన్ని ఎవరూ కూడా మెచ్చలేరని, దీంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇక తాజాగా స్థానికంగా ఉండే రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.