ఇటీవల ప్రైవేల్ కాలేజీల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ నార్సింగ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. మానసికమైన ఒత్తిడి భరించలేక క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక విషయాలు, ప్రేమ వ్యవహారాలు, చదువు ఇలా కారణాలు ఏవైనా ఆత్మహత్యలు చేసుకొని నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇటీవల చదువుల విషయంలో తీవ్రమైన ఒత్తిడి భరించలేక చాలా మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నార్సింగ్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా హన్మకొండలో ఓ ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పపడి ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా ప్రైవేట్ కాలేజీలు మంచి ర్యాంకులు రావాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఆ ఒత్తిడి భరించలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు కొద్దిసేపు హడావుడి చేసి కంటి తుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. తాజాగా హన్మకొండకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. జనగామ జిల్లా ఏడునూతల గ్రామానికి చెందిన మురారిశెట్టి నాగజ్యోతి అనే విద్యార్థిని హన్మకొండలోని సువిద్యా జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజ్ కి చెందిన హాస్టల్ లో ఉంటుంది. సహ విద్యార్థినులతో ఎప్పుడూ చలాకీగా గడిపే నాగజ్యోతి బుధవారం జరిగిన పరీక్షకు హాజరై హాస్టల్ కి వచ్చింది.
పరీక్షకు హాజరై వచ్చినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి భావనతో ఉన్న నాగజ్యోతి రాత్రి 9 గంట ప్రాంతంలో విద్యార్థులు నిద్రపోయిన తర్వాత హాస్టల్ గదిలో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. ఇది గమనించిన సహ విద్యార్థినులు వెంటనే హాస్టల్ వార్డెన్ కి సమాచారం అందించారు. కాలేజ్ యాజమాన్యం నాగజ్యోతిని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే జ్యోతి మరణించినట్లు వైద్యులు తెలిపారు. తర్వాత కా మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నాగజ్యోతి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. నాగజ్యోతి మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తమ కూతురు ఆత్మహత్యకు పాల్పపడేంత పిరికిది కాదని.. నాగజ్యోతి చనిపోయిన విషయం ముందుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని హాస్పిటల్ కి ఎలా తరలిస్తారని బంధువులు కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వద్ద విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద, ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.