ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. కొందరు పచ్చని సంసారాన్ని పక్కన పెట్టి పరాయి పడక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. ఈ క్రమంలో భాగస్వామిని కాదని పరాయి వారితో శారీరక సంబంధాలు ఏర్పచుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే క్షణిక సుఖం కోసం భాగస్వామిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ వివాహేతర సంబంధం..వివాహ బంధానికి మరణ శాసనం రాసింది. ప్రియుడిపై మోజు పడిన ఓ మహిళ.. పెళ్లిపీటలపై తనతో ఏడు అడుగులు నడిచిన భర్తను దారుణంగా చంపేసింది. ఆపై ఏమి ఏరుగనట్లు నటించింది. నిజం నిప్పులాంటిది కాబట్టి ఆమెను జైలుకు పంపించింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నం జిల్లా పెదగండ్యాడ వియ్యపు వారిపాలెంలో అప్పారావు, ఉమ దంపతులు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అప్పారావు లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. కొన్నాళ్లపాటు హాయిగా సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి. అప్పారావు మద్యానికి బానిసై..తనకు వచ్చే సంపాదన అంతా దానికే సరిపెట్టేసేవాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయయి. దీంతో భర్త తీరుకు భార్య ఉమ విసుగు చెందింది. అతడికి ఎంత చెప్పిన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో భార్య ఉమ ఓ చోట పనిలో చేరింది. ఈ క్రమంలో సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న వెంకటరెడ్డి అనే వ్యక్తితో ఉమ కు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో ఉమ భర్త అప్పారావు తోనూ వెంకట రెడ్డి పరిచయం పెంచుకొన్నాడు. దీంతో ఉమా వాళ్ల ఇంటికి వెంకటరెడ్డి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు.
ఉమ పరిస్థితిని అవకాశంగా చేసుకుని ఆమెను వెంకట రెడ్డి ట్రాప్ చేశాడు. ఈ క్రమంలో ఉమ తన భర్త పెట్టి ఇబ్బందుల గురించి, ఆర్ధిక పరిస్థితుల గురించి వెంకటరెడ్డికి చెప్పింది. దీంతో ఆమెను ఓదార్చుతూ, ఆర్ధిక సాయం అందిస్తూ ఉండే వాడు. దీంతో అతడి వలలో ఉమ పడింది. ఈక్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడు మైకం, భర్త వేధింపులతో పూర్తిగా వెంకటరెడ్డికి లొంగిపోయింది. తన భర్తతో ఇక ఉండలేనని వెంకట రెడ్డికి ఉమ చెప్పింది. అప్పారావును అడ్డు తొలగించాలని సూచించింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్రణాళి వేసింది. శనివారం నాడు డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అప్పారావు ను పనిమీద బయటకు పిలిపించాడు వెంకటరెడ్డి. మరొక వ్యక్తితో కలిసి ఓ సెల్లార్ లో మద్యం తాగారు.
ఇదే సమయంలో వెంకటరెడ్డి కిటికీ చెక్కతో అప్పారావు తలపై మూడుసార్లు బలంగా మోదటంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సింహాచలం అనే వ్యక్తి సహకారంతో బైక్ పై మృతదేహాన్ని తరలించారు. వెయ్యబువానిపాలెం సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద అర్ధరాత్రి పడేసి వెళ్లిపోయారు.జరిగిన విషయాన్ని వెంకటరెడ్డి ఉమకు ఫోన్లో చేరవేశాడు. సీన్ కట్ చేస్తే ఉమ అద్భుతంగా నటిచింది. పక్కవారి సాయంతో విషయం తెలిసినట్లు ఉమ.. భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు సిద్ధమయ్యారు.
అయితే..” నా భర్తను నాకు ఇవ్వండి.. పోస్ట్ మార్టం పేరుతో నా భర్తను ముక్కలుగా కోసేస్తారు. నా ప్రాణమైన భర్త మృతదేహాన్ని అలా చేయొద్దు” అంటూ ఉమ వేడుకుంది . ఉమ తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు.. మృతుడు అప్పారావు భార్య ఉమ, ఆమె ప్రియుడు వెంకటరెడ్డి, మత దేహం తరలించేందుకు సహకరించిన సింహాచలంను అరెస్టు చేశారు పోలీసులు.