నేటికాలంలో కొందరు చేసే పనులు చూస్తుంటే ఈ సమాజం ఎటు వెళ్తుంది అనే సందేహం వస్తుంది. తండ్రి స్థానంలో ఉండి కూతురు లాంటి వారిపై కన్నేసి కామంతో దారుణాలకు పాల్పడుతూ ఆ స్థానానికి మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెళ్లై భార్యతో విడిపోయి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఆ ముగ్గురిలో టీనేజ్ లో ఉన్న కూతురు కూడా ఉంది. ఆ పిల్లలకు తండ్రిలాగా ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు చూపించాల్సిన వాడు..వావివరసలు మరచి వారిని వక్రబుద్ధితో చూశాడు. కూతురు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి రాక్షసానందం పొందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళకు గతంలో పెళ్లైంది. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయి తన ముగ్గురు పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. అప్పటికే భార్యతో విడిపోయిన ఓ వ్యక్తిని కొన్నేళ్ల క్రితం ఈ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు, ఓ మగపిల్లాడు, రెండో భర్త అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ కామంధుడికి ఆ పిల్లలో టీనేజ్ లో ఉన్న ఓ అమ్మాయిపై కన్నుపడింది.
ఎలాగైనా లోబర్చుకోవాలనే పశుబుద్ధితో ఆమె స్నానం చేస్తుండగా కిటికిలో నుంచి బాత్ రూమ్ లోకి ఫోన్ పెట్టి సీక్రెట్ గా వీడియో తీశాడు. ఈ క్రమంలో తర్వాతి రోజు ఉదయం తన భర్త ఫోన్ తీసి చూస్తుండగా.. కూతురు స్నానం చేస్తున్న వీడియోలు మహిళకు కనిపించాయి. దీంతో అతడిపై ఆ మహిళ ఘర్షణకు దిగింది. అక్కడితో ఆగక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గతం లోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అలాంటి వారికి శిక్షలు కూడా పడ్డాయి. అయినా కొందరు తాము మనుషులం అనే సంగతి మరిచి పశువులాగా ప్రవర్తిస్తూ, వావివరుసలు మరిచి ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పశువుల వలన ఎందరో చిన్నారులు బలైపోతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.