దొంగతనానికి వెళ్తే ఏం చేస్తారు? దొరికిందంతా దోచుకుని పారిపోతారు. కానీ, ఈ దొంగలు మాత్రం అలా కాదు.. ఏటీఎంలోని డబ్బులన్నీ కాల్చేశారు. పోలీసులు వచ్చారనే భయంతో వాళ్లు చేసిన పనికి ఏటీఎం మెషిన్‌లోని డబ్బులు కాలిపోయాయి. దీంతో అటు దొంగలకు, ఇటు బ్యాంక్ వాళ్లకు ఎవరికీ దక్కలేదు ఆ డబ్బులు.ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ లోని పటాన్‌చెరు గోకుల్ నగర్‌లోని ఎస్‌బీఐ ఎటీఎమ్ లో కొందరు దొంగలు చోరీ చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మెషిన్‌ని కోసి దాంట్లో డబ్బులు ఎత్తుకెళ్లేందుకు పథకం వేశారు. అందులో భాగంగా గ్యాస్ కట్టర్ తో ఏటీఎమ్ వద్దకు వెళ్లారు. డబ్బులు తీయటం కోసం గ్యాస్ కట్టర్ ను ఉపయోగించారు. ఈ సమయంలోగ్యాస్ కటర్ శబ్దానికి అక్కడ ఉన్న అలారం మోగింది. దీంతో దొంగలు భయపడి..గ్యాస్ కట్టర్ ని అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో గ్యాస్ కట్టర్ మంటలు ఏటీఎం మెషిన్‌కి అంటుకుంది. దీంతో మెషిన్‌లోని డబ్బులన్నీ కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు.మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.