భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేది సర్వసాధారణం. అయితే కొందరి దంపతుల మధ్య మాత్రం అనుమానం అనే భూతం వచ్చి చేరుతుంది. ఇక ఆ అనుమానం అనేది ఉంటే చాలు సంసారాలు నిట్టనిలువునా చీలిపోతాయి. అనుమానం కారణంగా ఎందరో బలైపోతున్నారు. తాజాగా ఓ ముగ్గురు బిడ్డల తల్లి కూడా అనుమానం అనే భూతానికి బలైంది.
భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేది సర్వసాధారణం. అయితే కొందరి దంపతుల మధ్య మాత్రం అనుమానం అనే భూతం వచ్చి చేరుతుంది. ఇక ఆ అనుమానం అనేది ఉంటే చాలు సంసారాలు నిట్టనిలువునా చీలిపోతాయి. కొందరు భర్తలు అనుమానంతో భార్యలను చిత్ర హింసలకు గురి చేస్తుంటారు. సైకోలా మారిపోయి… భార్యకు నరకం అంటే ఏమిటో చూపిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే… ఎదిగిన కొడుకులు ఉన్న భర్తలకు కూడా తమ భార్యలపై అనుమాన పడుతుంటారు. అనుమానం కారణంగా ఎందరో మహిళలు బలయ్యారు. తాజాగా ఓ మహిళ కూడా ఈ అనుుమానం అనే భూతానికి బలైంది. సైకో భర్తను భరించలేక తనువు చాలించింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట గాంధీనగర్ కు చెందిన కరుకోల లక్ష్మీ(48)అనే మహిళకి నారాయణ మూర్తి అనే వ్యక్తితో ముప్పై ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారందరూ ఉద్యోగాల రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇంట్లో ఈ దంపతులు ఇద్దరే నివాసం ఉంటున్నారు. అయితే నారాయణమూర్తి భార్య లక్ష్మిపై అనుమానం పెంచుకున్నాడని తెలుస్తోంది. ఆమెను వేధింపులకు గురి చేసేవాడని, నిత్యం దారుణంగా కొట్టేవాడని లక్ష్మి సోదరి ఆదెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతను బయటకు వెళ్లే సమయంలో తన సోదరిని ఇంట్లోనే పెట్టి తాళం వేసేవాడని ఆమె తెలిపింది. ఇంటికి రెండు వైపుల తాళాలు వేసి బయటకు వెళ్లేవాడని, శనివారం కూడా అలానే చేశాడని ఆదెమ్మ తెలిపారు. అలా శనివారం బయటకు వెళ్లి.. సాయంత్రం తిరిగి వచ్చే సరికి లక్ష్మి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందని తమకు చెప్పడంతో వెళ్లి చూశామని ఆదెమ్మ తెలిపారు. విగత జీవిగా ఉన్న సోదరిని చూసి ఆదెమ్మ కన్నీరుమున్నీరు గా విలపించింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడి పరిసరాలను పరిశీలించిన పోలీసులు అనంతరం స్థానికుల నుంచి కూడా వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. ఆదెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానం కారణంగా ఇలా నిత్యం ఎందరో మహిళలు చిత్ర హింసలకు గురై.. చివరకు బలవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.