నిత్యం ఎక్కడో ఒక్కచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మానిషి రూపంలో ఉన్న కొందరు మృగాలు ఆడవారిపై అఘాయిత్యాలకు తెగపడుతున్నారు. దీంతో ఈ మానవ మృగాల మధ్య మహిళలు బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. అయినా మాటువేసి మరి..మహిళలు, యువతులపై దాడులకు తెగపడుతున్నారు. మరి.. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన మరువక ముందే మరో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని ఓ యువతిపై కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో దౌరాల పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్19న కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని దారుణంగా కొట్టారు. పోలాల మధ్యలోకి తీసుకెళ్లి భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు అయితే సదరు మహిళ కాళ్లు, చేతులు పట్టుకుని గడ్డిలో ఈచ్చుకుంటూ వెళ్లారు. అనంతరం ఆమెపై కాళ్ల, చేతులతో తన్నారు. ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు చినిపోయేలే కొట్టారు. ఈక్రమంలో తనను కాపాడాలని బాధితురాలు ఆర్తనాదాలు చేసింది. తనను వదిలేయమని గట్టిగా అరుస్తూ వేడుకుంది. ఇంత జరుగుతున్న చుట్టుపక్కల వారు చూస్తూనే ఉన్నారు కానీ.. ఎవరూ కూడా ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేయలేదు. కొందరు ఆ దాడులకు పాల్పడిన వారికి వత్తాసుగా మాట్లాడుతున్నారు. మహాభారతంలో కౌరవుల మధ్య ద్రౌపదికి అవమానం జరిగినట్లు.. ఈ మహిళపైకు ఈ కలియుగ కౌరవులు ప్రవర్తించారు.
వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసి.. చివరకు ఒంట్లో సత్తువలేక నిస్సహాయురాలిగా ఉండిపోయింది. ఇంక దారుణం ఏమిటంటే ఆమెపై జరిగిన దాడిన ఫోన్లలో రికార్డు చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయి.. చివరకు పోలీసులకు చేరింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళపై దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి బరేలీలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#UttarPradesh #Meerut https://t.co/CLmhh0xzgt
— Rajneesh Malhotra (@rmbawa) September 26, 2022