సమాజంలో అక్రమ సంబంధం అనే పదం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఇవాళా రేపట్లో.. ఇల్లీగల్ ఎఫైర్ కూడా ఒక ప్యాషన్‌గా మారిపోవడం చూస్తున్నాం. కట్టుకున్న వారితో కలిసుండేందుకు చాలా మంది ఇంట్రస్ట్ చూపించడం లేదు. అందమైన భాగస్వామిని ఇంట్లో పెట్టుకుని ఎంగిలి మెతుకుల కోసం వెంపర్లాడుతున్నారు. అక్కడితో ఆగకుండా అగ్ని సాక్షిగా పెళ్లాడిన వారిని హతమార్చేందకు కూడా వెనుకాడటంలేదు. అయితే ఇక్కడ మగవారిని లేదా ఆడవారిని ఒక్కళ్లపైనే నిందలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్షణిక సుఖకోసం కట్టుకున్న వాళ్లను కడతేరుస్తున్న జాబితాలో భర్తలు, భార్యలు ఇద్దరూ ఉంటున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తుంది.
తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని తిరుప్పలైలోని ఓ ప్రాంతంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి వైష్ణవి అనే యువతితో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ అనంతరం సెంథిల్ కుమార్, వైష్ణవి చాలా సంతోషంగా సంసారం చేశారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ కుమార్తె పుట్టింది. ఇక భార్య, బిడ్డను ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని సెంథిల్ కుమార్ భావించాడు. అందుకోసం అతడు విదేశాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్నాడు. విదేశాల్లో తాను సంపాదిస్తున్న డబ్బును భార్య వైష్ణవికి పంపిస్తుండేవాడు. భర్త నెలనెల డబ్బులు పంపిస్తుండటంతో వైష్ణవి సొంత ఊరిలో సంతోషంగా ఉంటుంది. కుమార్తె తో నివాసం ఉంటున్న వైష్ణవి ఇంటికి.. ఆమె సమీప బంధువు వెంకటేషన్ అప్పుడప్పుడు వస్తుండే వాడు.
ఈక్రమంలో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆమె బుద్ధి వక్రమార్గం పట్టి.. వెంకటేష్ పై మోజు పెంచుకుంది. భర్త దూరంగా ఉండటంతో పరాయి సుఖం కోసం వైష్ణవి కక్కుర్తి పడింది. వెంకటేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక చుట్టుపక్కలక వారికి అనుమానం రాకుండా వెంకటేష్..వైష్ణవి ఇంటికి వచ్చి.. ఎంజాయ్ చేసి వెళ్లేవాడు. ఆమె కూడా వెంకటేష్ మోజులో పడి భర్తను పట్టించుకునేది కాదు. సెంథిల్ ఫోన్ వచ్చిన సరిగ్గా మాట్లాడేది కాదు. కేవలం అతడు పంపించే డబ్బులపైనే ఆసక్తి చూపించేది. భార్య చేస్తున్న రంకుతనం గురించి తెలియక విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు సెంథిల్. తన భార్యను కుమార్తెను చూసేందుకు ఇటీవల తమిళనాడుకు వచ్చాడు.
వైష్ణవి,వెంకటేష్ అక్రమ సంబంధం తెలియని సెంథిల్ కుమార్తెను స్కూల్ వద్ద వదిలేందుకు వెళ్లాడు. అయితే తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తాడని చంపేయాలని ప్రణాళిక వేసింది. తన భర్త బయటకి వెళ్లిన విషయం ప్రియుడు వెంకటేష్ కి తెలిపింది. దీంతో వెంకటేష్ హెల్మెంట్ పెట్టుకుని సెంథిల్ వెనుకపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. తీవ్రగాయాలైన సెంథిల్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు బాధితుడి భార్య.. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అని తేలింది. దీంతో వైష్ణవితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.