మహాలక్ష్మి, సీతారామలక్ష్మి అత్తకోడళ్లు. మీరి మధ్య జరిగిన గొడవలకు ఉప్పు, నీప్పులా ఉండేవారు. ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. దీంతో పక్కా ప్లాన్ తో ముందుకు కదిలిన కోడలు.. అత్త సీతారామలక్ష్మిని దారుణంగా హత్య చేసింది.
మాములుగా అత్తకోడళ్లు అన్నాక గొడవలు పడడం సహజం. ప్రతీ చిన్న విషయానికి కూడా గొడవ పడుతుంటారు. చివరికి గోరుతో పోయేదాన్ని కొందరు అత్తాకోడళ్లు గొడ్డలి వరకు తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ కోడలు అత్తను అతి దారుణంగా కొట్టి చంపింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు కోడలు అత్తను ఎందుకు హత్య చేసింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తిరునల్వేలి జిల్లా తులుకార్కులం పరిధిలోని వడుకనపట్టి గ్రామం. ఇక్కడే రామస్వామి – మహాలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే, అంతా బాగానే ఉన్నా కోడలు మహాలక్ష్మికి అత్త సీతారామలక్ష్మి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. గత కొంత కాలంగా అత్తాకోడళ్లు ఉప్పు, నీప్పులా ఉంటున్నారు. ప్రతీ చిన్న విషయానికి గొడవ పడడం, ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకునేవారు. ఇలా ఈ వ్యవహారం చాలా కాలం నుంచి సాగుతూ వస్తుంది. కాగా, కోడలు పోరు పడలేక అత్త సీతారామలక్ష్మి కొడుకుకి సపరేట్ ఇల్లు కట్టించింది. దీంతో కాలంగా వీళ్లు అక్కడే ఉంటున్నారు.
ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగినా.. వైరం మాత్రం అస్సలు తగ్గలేదు. ఇటీవల ఈ అత్తకోడళ్లు మారోసారి గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన కోడలు మహాలక్ష్మీ.. అత్త సీతారామలక్ష్మిని ఎలాగైన ప్రాణాలతో లేకుండా చేయాలని అనుకుంది. ఇందులో భాగంగానే కోడలు మహాలక్ష్మీ పక్కా స్కెచ్ వేసింది. సోమవారం తెల్లవారుజామున అత్త సీతారామలక్ష్మి ఇంట్లో నిద్రపోతూ ఉంది. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు.. హెల్మెంట్ ధరించి అత్త ఇంట్లోకి వెళ్లింది. వెళ్తూ వెళ్తూనే కర్రతో అత్త తలపై బలంగా బాదింది. ఈ దాడిలో అత్త సీతారామలక్ష్మి రక్తపు మడుగులో పడిపోయింది. అనంతరం ఆమె వద్ద ఉన్న నగలను సైతం తీసుకెళ్లిన మహాలక్ష్మీ.. ఇది దొంగలు హత్యగా చిత్రకరించే ప్రయత్నం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న సీతారామలక్ష్మి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ సీతారామలక్ష్మి మంగళవారం కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. దొంగలు నగలు ఎత్తుకుపోయి సీతారామలక్ష్మిని హత్యచేశారని పోలీసులు అనుమానించారు. అయితే, దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ వీడియోను పరిశీలించగా అత్తను కోడలే హత్య చేసిందని అందరూ అనుమానించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా మహాలక్ష్మి నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగాతీవ్ర కలకలంగా మారింది.