ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా వరకట్న వేధింపులు అడ్డుకట్టే లేకుండా పోతోంది. దీనికి భర్తతో పాటు అత్తమామలు తోడవ్వడంతో వేధింపులు మరింత ఎక్కువవుతున్నాయి. ఇలా వరకట్న వేధింపులతో ఎంతో మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే భర్తలే భార్యలను హత్యలు చేస్తున్నారు. ఇలా భార్యపై వరకట్న వేధింపులకు కాలుదువ్విన ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. రావాల్సిన వరకట్నం తేలేదని భార్యపై బంధువులతో అత్యాచారం చేయించాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.
ఇది కూడా చదవండి: క్లాస్ రూమ్ లో మాస్టారు వెకిలి చేష్టలు.. ఎవరికైనా చెబితే తాళి కట్టేస్తా!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని భరత్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి హర్యానాకు చెందిన మహిళను 2019 లో వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం సమయంలో అత్తింటి వారు ఇస్తానన్న రూ.1.5 లక్షల కట్నం ఇవ్వలేదు. దీంతో అత్తింటివారు కట్నం కోసం కోడలిని తరచూ వేధింపులకు గురి చేసేవారు. ఇదే విషయంపై తరుచు గొడవలు సైతం జరుగుతూ ఉండేవి. ఇక ఇన్నాళ్లు వేచి చూసిన భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అత్తింటికి వెళ్లిన భర్త భార్యను మళ్లీ ఇంటికి రప్పించుకున్నాడు.
మరుసటి రోజు తన బంధువులను ఇద్దరిని ఇంటికి పిలిపించుకుని భార్యపై అత్యాచారం చేయించాడు. ఇంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో తట్టుకోలేకపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ విచారించగా.. ఇవ్వాల్సిన కట్నం ఇవ్వని కారణంగానే ఈ వీడియోలతో డబ్బులు సంపాదిస్తున్నానంటూ పోలీసులకు వివరించాడు. అనంతరం పోలీసులు అతనిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.