ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్ల క్రైమ్ సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను నమ్మించి లక్షలు, లక్షలు పోగుజేసి నిరుద్యోగులను బురిడి కొట్టించి చివరికి పంగనామాలు పెడుతున్నారు. ఇలాంటి క్రైమ్ స్టోరీలు మనం ఎన్నో విన్నాం, చదివాం కూడా. ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలాంటిదే. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏకంగా నాలుగు జిల్లాకు చెందిన నిరుద్యోగులను మోసం చేశాడో కంత్రీగాడు. గత కొన్నేళ్ల నుంచి సాగిస్తున్న ఈ మోసగాడి లెక్కలను పోలీసులు ఎట్టకేలకు తేల్చేశారు. ఇదే అంశం ఇప్పుడు నాలుగు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలు ఎవరీ కేటుగాడు? నాలుగు జిల్లాల నిరుద్యోగులను మోసం చేయడానికి ఇతడు వేసిన ప్లాన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అతని పేరు గుత్త గణేష్. 2018లో రాజమండ్రిలో సోనిక్ కన్సల్టెన్సీ అవుట్ సోర్సింగ్ అండ్ మ్యాన్ పవర్ అనే ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని కట్టుబొట్టును చూసి అందరు నిజంగానే నమ్మేశారు. ఇక ఇంకేముంది.. ఒకరి తర్వాత ఒకరిని ఇలా ఎంతో మంది వద్ద డబ్బులు వసూలు చేసి లక్షలు కూడబెట్టాడు.
ఇక కొంత కాలానికి కొందరు యువకులు గణేష్ ను సంప్రదించి ఉద్యోగాల గురించి తెలుసుకుందామని రాజమండ్రికి చేరుకున్నారు. అతని ఆఫీసుకు వెళ్లి తెలుసుకోగా అతడు కన్సల్టెన్సీని పూర్తిగా ఎత్తేశాడని తెలుసుకుని అంతా షాక్ కు గురయ్యారు. దీంతో నిండా మోసపోయామని నిర్ధారించుకున్న యువకులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గణేష్ ను పట్టుకునేందుకు అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఇతగాడిని ఎట్టకేలకు కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా ఇదే అంశం నాలుగు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉద్యోగాలు కల్పిస్తానని వేలకు వేలు డబ్బులు ఈ కంత్రీగాడి మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కంత్రి మాస్టారు కీచక లెక్కలు.. విద్యార్థిని నమ్మించి సినిమాకు తీసుకెళ్లి!