పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్త రాక్షసుడిలా మారి భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సంతోషంగానే సాగింది. కానీ, భార్యపై భర్తకు కాస్త అనుమానం ఉండేది. ఇదే కారణంతో భార్యను తరుచు వేధింపులకు గురి చేసేవాడు. ఆ మహిళ మాత్రం.. సంసారంలో ఇదంతా మాములే అనుకుంది. భర్త మాత్రం అలా అనుకోలేదు. అంతేకాకుండా ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని యల్లారెడ్డిపల్లె గ్రామం. ఇక్కడే సునీత-శ్రీను దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్త రాక్షసుడిలా మారాడు. తరుచు భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఇక ఇదే కారణంతో భర్త భార్యతో గొడవకు దిగేవాడు. కొన్ని రోజుల తర్వాత పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించారు. ఇప్పటి నుంచి బుద్దిగా ఉంటానని శ్రీను అందరినీ నమ్మించాడు. భార్య కూడా నమ్మింది.
అయితే సోమవారం రాత్రి అందరూ తిని పడుకున్నారు. భర్త నిద్రలేచి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కోపంతో ఊగిపోయిన భర్త.. అదే రాత్రి భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సునీత మృతదేహాన్ని పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న సునీత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అనుమానంతో భార్యను చంపిన ఈ కసాయి భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.