సమాజంలో జరిగే అన్యాయాలను అరికడుతూ, దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత పోలీసులదే. అలానే రోడ్డు ప్రమాదాలు జరగకుండా, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత. రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలకు భారీగా జరిమానాలు వేస్తూ రోడ్డు ప్రమాదాలను పోలీసులు నివారిస్తుంటారు. ఇలా అనేక రకాలైన సమస్యల నుంచి ప్రజలను పోలీసులు రక్షిస్తుంటారు. అయితే అలా ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ వాహనం.. ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఓ తెలుగమ్మాయిని అక్కడి పోలీసు వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలో సీటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం సోమవారం రాత్రి 23 ఏళ్ల యువతిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువతి మరణించినట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక పోలీస్ శాఖ నుంచి వచ్చిన వివరాల ప్రకారం.. 23 ఏళ్ల యువతి సీటెల్ సిటీలో ఓ ప్రాంతంలో రోడ్డుకు ఓ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఇదే సమయంలో అటుగా స్థానిక పోలీసుల వాహనం వెళ్లింది. ఈ క్రమంలో ఆ పోలీసుల వాహనం సదరు యువతిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో మరణించింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి గా గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారులు ఎవరనేది మాత్రం బయటకు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారని సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో సీటెల్ ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి వైద్యబృందం వచ్చే లోపు.. ఆమెను బతికించేందుకు అధికారులు సీపీఆర్ చేశారు. అనంతరం వైద్యబృందం వచ్చి ఆమె ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అలానే మెరుగైన వైద్యం కోసం జాహ్నవి ని హార్బర్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా ఆమె మరణించింది. ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నారని, ప్రమాదం జరగడానికి గల పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం వెళుతున్న అనేక మంది తెలుగు వారు, భారతీయులూ తరచూ చనిపోతూనే ఉన్నారు. ఇలాంటి మరణాలతో.. భారతదేశంలో ఉండే వారి కన్నవారు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.