ఆమె పేరు సుమలత. వయసు 35 ఏళ్లు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఈమెకు రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త స్థానికంగా పనికి వెళ్తుండగా.. భార్య గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లేది. ఇలా భార్యాభర్తలు రోజూ పనులకు వెళ్తూ సంసారాన్ని ఈడ్చుకొస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం సుమలత ఎప్పటిలాగే గ్రామంలోని ఓ రైతు పొలంలో పత్తి తీసేందుకు వెళ్లింది. ఇక సాయంత్రం భర్త పనికెళ్లి ఇంటికొచ్చాడు. కానీ, రాత్రైనా భార్య ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ భర్త గ్రామంలో అందరినీ అడిగాడు. ఎవరు ఖచ్చితమైన సమాచారం చెప్పలేదు. ఆ సమయంలో భర్త రవికి ఏం చేయాలో తోచలేదు.
ఇక చివరి ప్రయత్నంగా భర్త రవి భార్య పనికి వెళ్లిన పత్తి చేనులోకి వెళ్లాడు. చుట్టూ కమ్మిన చీకటి, పైగా అర్థరాత్రి. అతనికి ఆ సమయంలో ఏం కనిపించడం లేదు. భయం భయంగా.. పత్తి చేనులో అంతటా వెతికాడు. అయితే రవికి ఓ చోట ఏదో కింద పడిపోయినట్లుగా అనిపించింది. దీంతో వెంటనే తన సెల్ ఫోన్ లైట్ వేసి చూడగా.. భార్య సుమలత శవమై కనిపించింది. ఆ సీన్ చూసిన భర్త ఒక్కసారిగా షాక్ గురై.. ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. ఇది నిజమా, అబద్దమా అని తెల్చుకోలేక తనలో తాను కుమిలిపోయడు. ఆ క్షణంలో రవి గుండెలు పగిలేలా ఏడ్చాడు.
అనంతరం రవి ఇదే విషయంపై పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సుమలత మృతదేహన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమలత మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఉన్నట్టుండి భార్య చనిపోవడంతో భర్త రవి, సుమలత తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. సుమలత మరణానికి కారణం తెలియాల్సి ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.