అతని పేరు సంజయ్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇతను స్థానికంగా ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. రోజు ఫ్యాక్టరీకి వెళ్లడం తిరిగి ఇంటికి చేరుకుని సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే సరిగ్గా గతేడాది డిసెంబర్ 4న అర్థరాత్రి సంజయ్ ఫోన్ కు వాట్సాప్ లో ఓ లింక్ వచ్చింది. వెంటనే ఆ లింక్ ను ఓపెన్ చేసిన సంజయ్ కు అందమైన అమ్మాయిల ఫోటోలు తన ఫోన్ లోని స్క్రీన్ నిండా కనిపించాయి. ఆ ఫోటోలను చూసిన అతను కాస్త టెమ్ట్ అయ్యాడు.
ఆ ఫోటోలు చూస్తున్న క్రమంలోనే సంజయ్ కు ఓ కేటుగాడు.. మీకు ఈ కాల్ గల్స్ కావాలంటే ఇంటికి పంపుతాం. కానీ ముందుగా కొంత డబ్బులు చెల్లించాలని చెప్పాడు. ఈ విషయంలో కాస్త తొందరపడ్డ సంజయ్.. ఫోన్ పే చేస్తానని రిప్లయ్ ఇచ్చాడు. నా దగ్గర ఫోన్ పే లేదని, మీ కార్డు వివరాలు చెప్పండి చాలు అంటూ సంజయ్ కి రిప్లయ్ ఇచ్చాడు. ఇక కాస్త కూడా ఆలోచించకుండా సంజయ్ వెంటనే అతని కార్డు వివరాలు పూర్తిగా చెప్పేశాడు. అలా కొంత కాలానికి సంజయ్ రెండు మూడు దఫాల్లో ఏకంగా రూ. 2.45 లక్షలు చెల్లించాడు.
ఇక డబ్బులు పోయాయి కానీ.. కాల్ గర్ల్స్ మాత్రం ఇంటికి రాలేదు. చివరికి ఇది మోసమని గ్రహించిన సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ లో తలదాచుకున్న జీవన్ కుమార్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజస్థాన్ కేంద్రంగా ఈ కేటుగాడు అనేక మందిని ఇలాగే మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 4 జిల్లాల పోలీసులకు చుక్కలు చూపించాడు!