ఈ రోజుల్లో చాలా మంది మహిళలు భర్త ఉండగానే పరాయి సుఖం కోసం పాకులాడుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. తన వ్యక్తిగత సుఖం కోసం ప్రియుడిపై మోజుతో అడ్డొచ్చిన భర్తను కూడా అంతమొందించేందుకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే పరాయి సుఖం కోసం పాకులాడిన ఓ భార్య చివరికి జైల్లో చిప్పకూడు తింటోంది. ఇటీవల మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అది మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్లతండా పంచాయతీ పరిధిలోని కొయ్యగుండ తండా. ఇక్కడే కాట్రోతు శ్రీను (28), దేవి దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఆ దంపతుల సంసారం సంతోషంగానే సాగుతూ వచ్చింది. అలా రోజులు గడుస్తున్న క్రమంలోనే భార్య దేవి బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. దీంతో ఇంట్లో మొగుడు ఉండగానే భార్య ఎదురింటి మగాళ్లపై కన్నేత్తి చూసేది. అలా అదే తండాలో దేవి పలువురితో అక్రమ సంబంధాలు నడిపినట్లు సమాచారం. అలా కొన్ని రోజుల తర్వాత దేవి చీకటి కాపురం భర్త శ్రీనుకు తెలిసింది. దీంతో భర్త శ్రీను భార్య దేవికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇక నుంచైనా భార్య తీరు మారుతుందని భర్త ఆశించాడు. కానీ దేవి మాత్రం తగ్గేదే లే అంటూ అలాగే ప్రియుళ్లతో రొమాన్స్ కు ముందుకు కదిలింది.
ఇక తన పరాయి సుఖం కోసం భర్త అడ్డుగా ఉన్నాడని గ్రహించిన భార్య దేవి ఊహించని నిర్ణయం తీసుకుంది. దీంతో వరసకు కొడుకు అయిన పవన్ కుమార్, స్నేహితురాలైన రాణిని దేవి సాయం కోరింది. నా భర్తను చంపితే మీకు రైతు భీమా డబ్బులు రాగానే రూ.50 వేలు ఇస్తానని ఆశ చూపింది. ఇక ఇందులో భాగంగానే ఈ నెల 18న రాత్రి భర్త శ్రీనుకు దేవి అతని స్నేహితులతో మద్యం తాగించింది. అతను ఫుల్ గా మద్యం మత్తులో జారుకున్నాక.., పవన్ కుమార్, రాణి, భార్య దేవి పొలంలో చెట్టుకు ఉరి వేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం శ్రీను శవాన్ని పొలంలో వదిలేసి అక్కడి నుంచి ఇంటికెళ్లారు. ఇక తెల్లారే సరికి భార్య దేవి ఏం ఎరుగనట్లు కొత్త రాగాన్ని ఎత్తుకుంది.
నా భర్తను ఎవరో హత్య చేశారంటూ ఏడుస్తున్నట్లు నటించింది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాపును వేగవంతం చేశారు. కానీ పోలీసులకు ఎందుకో భార్యపై అనుమానం వచ్చింది. వెంటనే భార్య దేవి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా దేవి అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది ఖచ్చితంగా భార్య పనేనని పోలీసులు అనుమానించారు. ఆ దిశగా పోలీసులు భార్య దేవిని విచారించగా అసలు నిజాలు వెల్లగక్కి నా భర్త నేను హత్య చేశానంటూ ఒప్పుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండా వాసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసులు నిందితులైన భార్య దేవి, రాణి, పవన్ కుమార్ లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.