మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ కవి అందెశ్రీ అన్నట్లు.. ఈ మద్య కొంత మంది మనుషులు పూర్తిగా మానత్వం మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మూగ జీవుల పట్ల కొందరు క్రూరంగా ప్రవర్తిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ముగ్గురు యువకులు ఓ వీధి శునకం మెడకు రాళ్లు కట్టి దారుణంగా హింసించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపుర్‌లో జరిగింది.
ఈ మద్య కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంత మంది తమ టాలెంట్ చూపిస్తుంటే.. మరికొంత మంది మూగజీవాలను హింసిస్తూ వీడియోలు తీసి దాన్ని వైరల్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపుర్‌లో ముగ్గురు కిరాతకులు ఓ వీధి శునకాన్ని చంపేసేందుకు దాని మెడకు పెద్ద బండరాయిని కట్టి.. బలవంతంగా నీటిలోకి ఈడ్చిపడేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి ఆ శునకం ఎంత ప్రయత్నించినా వారు కనికరించలేదు.
ఆ కుక్కు వరద నీటిలో పడిన తర్వాత ఎలాగో అలా మళ్లీ బయటకు వచ్చింది. ఆ కుర్రాళ్లు అక్కడే ఉండటంతో భయపడి అక్కడ నుంచి ఉడాయించి ప్రాణాలు రక్షించుకుంది. ఆ కుర్రాళ్లు ఈ దారుణమైన పని చేస్తుంటే.. మరో వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో జంతు ప్రేమికులు సీరియస్ అయ్యారు. ఆ కుక్కను దారుణంగా హింసించి వీడియో తీసిన ఆ యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
The incident happened 3 days back on 13 July 22 in Daheli village , Bamni (Ballarsha) and the person name is Dinkar Gaikwad.(maharashtra)
Please share the video !! And give justice to poor Dog.@asharmeet02 @pfaindia @MumbaiPolice @DGPMaharashtra @TheJohnAbraham @SonuSood pic.twitter.com/T89nZF8vVB— 🇮🇳Pratham Bisht (@PrathamBisht12) July 18, 2022