Lemon: మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు నశిస్తున్నాయి. చాలా మంది ఎదుటి వ్యక్తి ప్రాణాల కంటే ప్రాణంలేని వస్తువులకు, చిల్లర డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది వాటికోసం ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు. బుధవారం జరిగిన ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నిమ్మకాయల కోసం అత్త, ఇద్దరు మరదళ్లు కలిసి ఇంటి కోడల్ని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, మోతిహారి జిల్లా చైన్‌పుర్‌కు చెందిన కాజల్ దేవీ, సునీల్ బైతా భార్యభర్తలు. సునీల్, అతడి తండ్రి వేరే రాష్ట్రంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ అత్త, ఇద్దరు మరదళ్లతో కలిసి ఉంటోంది. బుధవారం ఇంట్లోని నిమ్మకాయల చెట్టునుంచి కాజల్ కొన్ని నిమ్మకాయలు కోసింది.
ఇది గమనించిన అత్తా, మరదళ్లు ఆమెపై గొడవకు వాగ్వివాదానికి. మాటమాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన వారు కాజల్ గొంతుకు తాడు బిగించి, ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మకాయలు కొంచెం ఖరీదైనవని, వాటిని కోయటం కారణంగానే గొడవ జరిగిందని తెలిపారు. ఆ గొడవ సందర్భంగా ఏం జరిగిందో తెలియాలన్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అందం ఎరగా వేసి, బూతు వీడియో తీసింది.. లక్షలు వచ్చినా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.